ఏపీలో తగ్గుతూ వస్తున్న కరోనా మరణాలు.. నేడు ఒక్కరే మృతి..!

Friday, December 18th, 2020, 07:36:15 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 69,062 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 458 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,806 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 4,377 మంది చికిత్స పొందుతుండగా 8,66,359 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 534 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,070 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,11,34,359 శాంపిల్స్ పరీక్షించారు.