భారత్‌లో కొత్తగా 4 లక్షలకు పైగా కేసులు.. 4 వేలకు పైగా మరణాలు..!

Saturday, May 8th, 2021, 10:02:39 AM IST

భారత్‌లో కరోనా విళయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,01,078 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి కొత్తగా 4,187 మంది మృతి చెందారు.

దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,18,92,676కి చేరింది. అయితే ప్రస్తుతం అందులో 37,23,446 యాక్టివ్ కేసులు ఉండగా, 1,79,30,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 2,38,270 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 3,18,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 81.9 శాతం ఉండగా, మరణాల రేటు 1.1 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.