ఏపీలో కొత్తగా 3,967 కరోనా కేసులు.. మరో 25 మంది మృతి..!

Friday, October 16th, 2020, 09:54:49 PM IST

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అయితే గడిచిన 24 గంటలలో 74,337 శాంపిల్స్‌ని పరీక్షించగా 3,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 25 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,75,470 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 38,979 మంది చికిత్స పొందుతుండగా 7,30,109 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 5,010 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,382 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 69,20,377 శాంపిల్స్ పరీక్షించారు.