ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Wednesday, October 14th, 2020, 09:41:19 PM IST


ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అయితే తాజాగా నేడు ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటలలో 69,463 శాంపిల్స్‌ని పరీక్షించగా 3,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 32 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,465కి చేరింది.

అయితే ఇందులో ప్రతుతం 41,669 మంది చికిత్స పొందుతుండగా 7,19,477 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 5,050 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,319 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67,72,273 శాంపిల్స్ పరీక్షించారు.