ఏపీలో నేడు భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

Saturday, March 20th, 2021, 11:55:27 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 30,978 శాంపిల్స్‌ని పరీక్షించగా 380 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత మూడు నెలల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా బారిన మరో ఇద్దరు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,93,366 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,083 మంది చికిత్స పొందుతుండగా 8,84,094 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 204 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,189కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,47,05,188 శాంపిల్స్ పరీక్షించారు.