ఏపీలో కొత్తగా 3,765 కరోనా కేసులు.. మరో 20 మంది మృతి..!

Friday, October 23rd, 2020, 07:10:05 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గాయి. అయితే గడిచిన 24 గంటలలో 80,238 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 3,765 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 20 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,00,684 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 31,721 మంది చికిత్స పొందుతుండగా 7,62,419 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 4,281 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,544 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 74,28,014 శాంపిల్స్ పరీక్షించారు.