ఏపీలో కొత్తగా 3,746 పాజిటివ్ కేసులు.. మరో 27 మంది మృతి..!

Wednesday, October 21st, 2020, 11:11:58 PM IST


ఏపీలో కరోనా ప్రభావం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తుంది. అయితే గడిచిన 24 గంటలలో 74,422 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 3,746 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 27 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,299 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 32,376 మంది చికిత్స పొందుతుండగా 7,54,415 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 4,739 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,508 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72,71,050 శాంపిల్స్ పరీక్షించారు.