ఏపీలో కొత్తగా మరో 357 కరోనా కేసులు.. మరో నలుగురు మృతి..!

Thursday, December 24th, 2020, 10:02:12 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 59,551 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 357 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,075 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 3,862 మంది చికిత్స పొందుతుండగా 8,69,124 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 355 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,089 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,14,74,797 శాంపిల్స్ పరీక్షించారు.