ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు.. మరో ఇద్దరు మృతి..!

Sunday, December 27th, 2020, 09:00:23 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 46,386 శాంపిల్స్‌ని పరీక్షించగా 349 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,061 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 3,625 మంది చికిత్స పొందుతుండగా 8,70,342 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 422 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,094 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,16,20,503 శాంపిల్స్ పరీక్షించారు.