ఏపీలో కరోనా కల్లోలం.. కొత్తగా మరో 3,263 పాజిటివ్ కేసులు..!

Monday, April 12th, 2021, 06:47:54 PM IST

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 33,755 శాంపిల్స్‌ని పరీక్షించగా 3,263 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు ఏకంగా 11 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,28,664 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 23,115 మంది చికిత్స పొందుతుండగా 8,98,238 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 1,091 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,311కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,54,63,146 శాంపిల్స్ పరీక్షించారు.