ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు.. మరో ఇద్దరు మృతి..!

Tuesday, December 29th, 2020, 11:41:42 PM IST


ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 50,794 శాంపిల్స్‌ని పరీక్షించగా 326 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,599 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 3,383 మంది చికిత్స పొందుతుండగా 8,71,116 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 364 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,100 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,17,08,678 శాంపిల్స్ పరీక్షించారు.