ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Monday, March 22nd, 2021, 10:33:42 PM IST


ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య భారీగా నమోదవుతూ వస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 35,375 శాంపిల్స్‌ని పరీక్షించగా 310 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,94,044 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,382 మంది చికిత్స పొందుతుండగా 8,84,471 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 114 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,191కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,47,71,701 శాంపిల్స్ పరీక్షించారు.