ఏపీలో నేడు మరింత తగ్గిన కరోనా కేసులు..!

Monday, December 14th, 2020, 08:29:33 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య వెయ్యి లోపలకే తగ్గిపోయింది. అయితే తాజాగా నేడు ఆ సంఖ్య మరింత తగ్గింది. గడిచిన 24 గంటలలో 44,935 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 305 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,836 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 4,728 మంది చికిత్స పొందుతుండగా 8,64,049 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 541 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,059 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,08,75,925 శాంపిల్స్ పరీక్షించారు.