కరోనా అప్డేట్: దేశంలో 98 లక్షలు దాటిన కరోనా కేసులు..!

Saturday, December 12th, 2020, 06:37:04 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 30,005 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 442 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 98,26,775 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 3,59,819 యాక్టివ్ కేసులు ఉండగా, 93,24,328 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,42,628 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 33,494 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,65,176 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 94.89 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.