ఏపీలో స్వల్ఫంగా పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Wednesday, October 28th, 2020, 10:34:20 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ స్వల్ఫంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తున్నా రెండు రోజుల నుంచి మళ్ళీ ఆ సంఖ్య మూడు వేలకు చేరువయ్యింది. అయితే గడిచిన 24 గంటలలో 77,028 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,949 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు మరో 18 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,14,774 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 26,622 మంది చికిత్స పొందుతుండగా 7,81,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 3,609 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,643 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77,73,681 శాంపిల్స్ పరీక్షించారు.