తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. నేడు ఎన్నంటే?

Friday, August 28th, 2020, 09:20:45 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో 2,932 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 11 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1580 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,415 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 87,675 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 28,941 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 799 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 61,863 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 12,04,343 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 74.06 శాతం ఉండగా, మరణాల రేటు 0.68% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.