ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

Tuesday, October 20th, 2020, 12:02:33 AM IST


ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అయితే గడిచిన 24 గంటలలో అది మరింత భారీగా తగ్గింది. మొత్తం 61,330 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 2,918 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 24 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,86,050 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 35,065 మంది చికిత్స పొందుతుండగా 7,44,532 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 4,303 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,453 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,27,533 శాంపిల్స్ పరీక్షించారు.