ఏపీలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Thursday, October 29th, 2020, 07:06:16 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఆగడంలేదు. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తున్నా రెండు రోజుల నుంచి మళ్ళీ ఆ సంఖ్య పెరిగింది. అయితే గడిచిన 24 గంటలలో 88,778 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,905 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు మరో 16 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,17,679 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 26,268 మంది చికిత్స పొందుతుండగా 7,84,752 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 3,243 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,659 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 78,62,459 శాంపిల్స్ పరీక్షించారు.