ఏపీలో కొత్తగా 2,901 కరోనా కేసులు.. మరో 19 మంది మృతి..!

Tuesday, October 27th, 2020, 07:20:30 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తున్న నేడు ఆ సంఖ్య కాస్త పెరిగింది. అయితే గడిచిన 24 గంటలలో 74,757 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,901 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 19 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,11,825 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 27,300 మంది చికిత్స పొందుతుండగా 7,77,900 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 4,352 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,625 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76,96,653 శాంపిల్స్ పరీక్షించారు.