తెలంగాణలో ఆగని కరోనా జోరు.. నేడు భారీగా కొత్త కేసులు..!

Wednesday, September 2nd, 2020, 09:52:02 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో 2,892 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 10 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,240 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,589 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 97,402 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 31,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 846 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 59,421 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 14,83,267 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 74.05 శాతం ఉండగా, మరణాల రేటు 0.64% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.