ఏపీలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

Tuesday, November 3rd, 2020, 07:41:00 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గడంతో కాస్త రిలీఫ్ అనిపించినా రోజువారీ కేసులలో మరింత తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా గడిచిన 24 గంటలలో 84,534 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,849 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 15 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,30,731 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 21,672 మంది చికిత్స పొందుతుండగా 8,02,325 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 3,700 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,734 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82,66,800 శాంపిల్స్ పరీక్షించారు.