తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉదృత్తి.. నేడు ఎన్ని కేసులంటే..!

Thursday, August 27th, 2020, 10:37:30 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజుల నుంచి భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో 2,795 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 8 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 872 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 86,095 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 27,600 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 788 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 60,386 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 11,42,480 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 75.02 శాతం ఉండగా, మరణాల రేటు 0.68% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.