ఏపీలో కొత్తగా 2,745 కరోనా కేసులు.. మరో 13 మంది మృతి..!

Thursday, November 5th, 2020, 06:59:39 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది. ఇటీవల స్కూళ్లు తిరిగి ప్రారంభించడంతో పలువురు విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతుండడంతో మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 85,364 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,745 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 13 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,35,953 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 21,878 మంది చికిత్స పొందుతుండగా 8,07,318 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 2,292 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,757 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 84,27,629 శాంపిల్స్ పరీక్షించారు.