ఏపీలో నేడు భారీగా పెరిగిన కరోనా కేసులు..?

Tuesday, March 16th, 2021, 07:32:39 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ నెమ్మదిగా పెరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 23,417 శాంపిల్స్‌ని పరీక్షించగా 261 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు ఎవరు మృతి చెందలేదు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,269 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1579 మంది చికిత్స పొందుతుండగా 8,83,505 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 125 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,185కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,45,80,783 శాంపిల్స్ పరీక్షించారు.