ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. నేడు కొత్తగా ఎన్నంటే?

Wednesday, March 17th, 2021, 07:00:12 PM IST

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు మళ్ళీ పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 30,716 శాంపిల్స్‌ని పరీక్షించగా 253 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు మరొకరు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,522 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1694 మంది చికిత్స పొందుతుండగా 8,83,642 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 137 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,186కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,46,11,499 శాంపిల్స్ పరీక్షించారు.