భారత్‌లో కోటి దాటిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Saturday, December 19th, 2020, 12:09:27 PM IST

భారత్‌లో కరోనా కేసుల ప్రభావం నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నా మొత్తం కేసుల సంఖ్య మాత్రం కోటి దాటింది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది భారీగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 25,152 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో 347 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,04,599 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 3,08,751 యాక్టివ్ కేసులు ఉండగా, 95,50,712 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,45,136 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 29,885 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,71,868 శాంపిల్స్ మాత్రమే పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 95.5 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.