ఏపీలో కొత్తగా 2,477 కరోనా కేసులు.. మరో 10 మంది మృతి..!

Wednesday, November 4th, 2020, 07:10:18 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గడంతో కాస్త రిలీఫ్ అనిపించినా రోజువారీ కేసులలో మరింత తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా గడిచిన 24 గంటలలో 75,465 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,477 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,33,208 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 21,438 మంది చికిత్స పొందుతుండగా 8,05,026 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 2,701 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,744 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 83,42,265 శాంపిల్స్ పరీక్షించారు.