భారత్‌లో కొత్త కరోనా టెన్షన్.. నేడు కొత్త కేసులు ఎన్నంటే?

Thursday, December 24th, 2020, 12:50:45 PM IST


భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుందకున్నా కొత్త కరోనా వైరస్ మళ్ళీ టెన్షన్ పుట్టిస్తుంది. ఇప్పటికే దీనిపై అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు జారీ చేసింది. బ్రిటన్ వంటి ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,712 కరోనా కేసులు నమోదు కాగా, 312 మంది కరోనాతో మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది. ప్రస్తుతం అందులో 2,83,849 యాక్టివ్ కేసులు ఉండగా, 96,93,173 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,46,756 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 95.75 శాతం ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.