ఏపీలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Friday, March 19th, 2021, 06:25:55 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గత వారం రోజులుగా రెండు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 31,546 శాంపిల్స్‌ని పరీక్షించగా 246 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,986 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1909 మంది చికిత్స పొందుతుండగా 8,83,890 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 131 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,187కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,46,74,210 శాంపిల్స్ పరీక్షించారు.