ఏపీలో కొత్తగా 2,410 కరోనా కేసులు.. మరో 11 మంది మృతి..!

Friday, November 6th, 2020, 09:49:39 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది. ఇటీవల స్కూళ్లు తిరిగి ప్రారంభించడంతో పలువురు విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతుండడంతో మళ్ళీ కేసుల సంఖ్యలో పెరుగుదల్ కనిపిస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 79,601 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,410 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,38,363 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 21,825 మంది చికిత్స పొందుతుండగా 8,09,770 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 2,452 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,768 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 85,07,230 శాంపిల్స్ పరీక్షించారు.