కరోనా అప్డేట్: భారత్‌లో నేడు కొత్త కరోనా కేసులు ఎన్నంటే?

Friday, December 25th, 2020, 07:30:19 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుందకున్నా కరోనా స్ట్రెయిన్ మళ్ళీ అందరిలో టెన్షన్ పుట్టిస్తుంది. ఇప్పటికే దీనిపై అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు జారీ చేసింది. బ్రిటన్ వంటి ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,067 కరోనా కేసులు నమోదు కాగా, 336 మంది కరోనాతో మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,46,845కి చేరింది. ప్రస్తుతం అందులో 2,81,919 యాక్టివ్ కేసులు ఉండగా 97,17,834 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,47,092 మంది కరోనా బారిన పడి చనిపోయారు. అలాగే గడిచిన 24 గంటల్లో 24,661 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 95.75 శాతం ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.