ఏపీలో కొత్తగా 22,517 కరోనా కేసులు.. మరో 98 మంది మృతి..!

Saturday, May 15th, 2021, 11:00:49 PM IST

ఏపీలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో 89,535 శాంపిల్స్‌ని పరీక్షించగా 22,517 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 98 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,11,320కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,07,467 మంది చికిత్స పొందుతుండగా 11,94,582 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 18,739 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,271కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,78,80,755 శాంపిల్స్ పరీక్షించారు.