ఏపీలో కొత్తగా 22,399 కరోనా కేసులు.. మరో 89 మంది మృతి..!

Thursday, May 13th, 2021, 08:21:18 PM IST

ఏపీలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో 96,446 శాంపిల్స్‌ని పరీక్షించగా 22,399 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 89 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,66,785కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,01,042 మంది చికిత్స పొందుతుండగా 11,56,666 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 18,638 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,077కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,77,02,133 శాంపిల్స్ పరీక్షించారు.