ఏపీలో కొత్తగా 2,237 కరోనా కేసులు.. మరో 12 మంది మృతి..!

Sunday, November 8th, 2020, 09:11:58 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గడంలేదు. ఇటీవల స్కూళ్లు తిరిగి ప్రారంభించడంతో పలువురు విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతుండడంతో మళ్ళీ కేసుల సంఖ్యలో స్వల్ఫ పెరుగుదల కనిపిస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 76,663 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,42,967 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 21,403 మంది చికిత్స పొందుతుండగా 8,14,773 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 2,256 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,791 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 86,63,975 శాంపిల్స్ పరీక్షించారు.