ఏపీలో కొత్తగా 22,204 కరోనా కేసులు, మరో 85 మంది మృతి..!

Wednesday, May 5th, 2021, 08:41:30 PM IST

ఏపీలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో 1,16,367 శాంపిల్స్‌ని పరీక్షించగా 22,204 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 85 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,06,232కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,70,588 మంది చికిత్స పొందుతుండగా 10,27,270 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 11,128 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,374కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,69,50,299 శాంపిల్స్ పరీక్షించారు.