ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. కొత్తగా మరో 21,954 కేసులు..!

Thursday, May 6th, 2021, 08:07:35 PM IST


ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో 1,10,147 శాంపిల్స్‌ని పరీక్షించగా 21,954 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 72 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,28,186కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,82,329 మంది చికిత్స పొందుతుండగా 10,37,411 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 10,141 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,446కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,70,60,446 శాంపిల్స్ పరీక్షించారు.