ఏపీలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

Thursday, March 18th, 2021, 09:40:13 PM IST

ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 31,165 శాంపిల్స్‌ని పరీక్షించగా 218 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి ఎవరు మృతి చెందలేదు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,740 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1795 మంది చికిత్స పొందుతుండగా 8,83,759 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 117 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,186కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,46,42,664 శాంపిల్స్ పరీక్షించారు.