హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా మరో 2,176 కరోనా కేసులు..!

Thursday, September 24th, 2020, 09:30:21 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడడంలేదు. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో 2,176 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 8 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,004 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,246 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,48,139 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 30,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1070 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 55,318 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 26,84,215 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 82.64 శాతం ఉండగా, మరణాల రేటు 0.59% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.