హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా మరో 216 కరోనా కేసులు..!

Saturday, March 13th, 2021, 10:00:14 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ నెమ్మదిగా పెరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 34,482 కరోనా పరీక్షలు నిర్వహించగా 216 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933 కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 2,97,363 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 1,918 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 168 మంది కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,652 కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 91,49,467 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 96.8 శాతం ఉండగా, మరణాల రేటు 0.54% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.