హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా 2,137 పాజిటివ్ కేసులు..!

Sunday, September 20th, 2020, 10:03:38 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 2,137 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 8 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,192 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,71,306 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,39,700 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 30,573 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1033 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 53,811 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 24,88,220 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 81.54 శాతం ఉండగా, మరణాల రేటు 0.60% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.