ఏపీలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Friday, March 12th, 2021, 06:40:22 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ నెమ్మదిగా పెరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 44,709 శాంపిల్స్‌ని పరీక్షించగా 210 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు మరొకరు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,388 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1227 మంది చికిత్స పొందుతుండగా 8,82,981 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 140 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,180 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,44,48,650 శాంపిల్స్ పరీక్షించారు.