ఏపీలో కొత్తగా 20,345 కరోనా కేసులు.. మరో 108 మంది మృతి..!

Tuesday, May 11th, 2021, 06:55:08 PM IST


ఏపీలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో 86,878 శాంపిల్స్‌ని పరీక్షించగా 20,345 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 108 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,95,102 మంది చికిత్స పొందుతుండగా 11,18,933 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 14,502 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,899కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,75,14,937 శాంపిల్స్ పరీక్షించారు.