తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 2,009 పాజిటివ్ కేసులు..!

Friday, October 2nd, 2020, 10:00:05 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా రోజుకు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో 2,009 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 10 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,437 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,609 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,65,844 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 28,620 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,145 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 54,098 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 31,04,542 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 84.78 శాతం ఉండగా, మరణాల రేటు 0.58% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.