తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే?

Friday, July 31st, 2020, 10:38:24 AM IST

తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ ఒక్కసారిగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా గడిచిన 24 గంటల్లో 1,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే కరోనా బారిన పడి నేడు 14 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని నేడు ఒక్కరోజే 816 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 62,707 చేరగా, కరోనా నుంచి కోలుకుని 45,388 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 16,796 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 519కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 21,380 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 4,37,582 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 72.3 శాతంగా ఉందని, మరణాల రేటు 0.82 శాతంగా ఉందని హెల్త్ బులెటిన్ తెలిపింది.