హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా 1,983 పాజిటివ్ కేసులు..!

Tuesday, October 6th, 2020, 09:30:08 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతంది. గత కొద్ది రోజులుగా రోజుకు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా నాలుగు రోజుల నుంచి రెండు వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో కేవలం 1,983 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో 10 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,381 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,02,594 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,74,769 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 26,644 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,181 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 50,598 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 32,92,195 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 86.26 శాతం ఉండగా, మరణాల రేటు 0.58% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.