తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. నేడు కొత్త కేసులు ఎన్నంటే?

Thursday, August 13th, 2020, 10:00:11 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,931 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 11 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,780 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,475 చేరగా, కరోనా నుంచి కోలుకుని 63,074 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 22,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 665కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 23,303 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6,89,150 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 72.93 శాతంగా ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.