ఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. మరో 13 మంది మృతి..!

Monday, November 2nd, 2020, 07:12:56 PM IST

ఏపీలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గగా నేడు ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే గడిచిన 24 గంటలలో 64,581 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 13 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,27,882 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 22,538 మంది చికిత్స పొందుతుండగా 7,98,625 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 3,033 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,719 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 81,82,266 శాంపిల్స్ పరీక్షించారు.