తెలంగాణలో పంజా విసిరిన కరోనా.. నేడు భారీగా నమోదైన కేసులు..!

Wednesday, June 10th, 2020, 10:03:38 PM IST

తెలంగాణలో కరోనా పంజా విసురుతుంది. గత కొద్ది రోజులుగా నమోదవుతున్న కేసులు సంఖ్యతో ప్రజలు కలవరపెడుతుండగా నేడు కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు 191 కొత్త కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 8 మంది మృతి చెందారు.

అయితే ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నేడు 143 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌లో 11 కేసులు, సంగారెడ్డిలో 11 కేసులు, రంగారెడ్డిలో 8 కేసులు, మహబూబ్‌నగర్‌లో 4 కేసులు, జగిత్యాల, మెదక్‌లో 3 కేసులు, నాగర్‌కర్నూల్, కరీంనగర్‌లో రెండేసి కేసులు, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేటలో ఒక్కో కేసు నమోదు అయ్యింది. అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,111 కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 1742 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 2030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 156కి చేరింది.