దేశంలో తగ్గుతున్న పాత కరోనా కేసుల సంఖ్య.. పెరిగిన కొత్త కరోనా కేసులు..!

Saturday, January 2nd, 2021, 01:30:33 PM IST

భారత్‌లో పాత కరోనా కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుందకున్నా, కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది. దేశంలో మొత్తం కొత్త కరోనా కేసుల సంఖ్య 29కి పెరిగింది. అయితే 29 మంది బాధితులను ఐసోలేషన్‌లో ఉంచినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,079 కరోనా కేసులు నమోదు కాగా, 224 మంది కరోనాతో మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,05,788కి చేరింది. ప్రస్తుతం అందులో 2,50,183 యాక్టివ్ కేసులు ఉండగా, 99,06,387 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,49,218 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంల్లో మొత్తం 22,926 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 96.01 శాతం ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.