తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉదృత్తి.. నేడు ఎన్ని కేసులంటే?

Wednesday, August 12th, 2020, 10:51:13 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,897 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 9 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,920 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,544 చేరగా, కరోనా నుంచి కోలుకుని 61,294 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 22,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 654కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 22,972 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6,65,847 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 72.49 శాతంగా ఉండగా, మరణాల శాతం 0.77గా ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.